ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష సహా.. కార్యకర్తల్లో మనో ధైర్యాన్ని నింపటమే లక్ష్యంగా చంద్రబాబు నేటి నుంచి మూడు రోజులు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ ఉదయం విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లనున్న చంద్రబాబు.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కుప్పం చేరుకుంటారు. గుడుపల్లె మండలం రాళ్లగంగమ్మ ఆలయం వద్ద కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు కుప్పం పర్యటన - chandrababu naidu latest tour
సుదీర్ఘ విరామం అనంతరం తెలుగుదేశం అధినేత చంద్రబాబు... గురువారం నుంచి మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని అధిక స్థానాల్లో వైకాపా బలపరిచిన అభ్యర్థులు గెలుపొందినట్లు వెలువడిన ఫలితాల విశ్లేషణల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు కుప్పం పర్యటన
మధ్యాహ్నం కుప్పానికి చేరుకుని.. గ్రామీణ మండల కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రికి కుప్పంలోనే బస చేయనున్నారు. శుక్ర, శనివారాల్లోనూ రామకుప్పం, శాంతిపురం, కుప్పం మండలాల నాయకులతో.. సమావేశం అవుతారు. మూడు రోజుల విస్తృతస్థాయి సమావేశాల్లో కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. శనివారం కుప్పం నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు.
ఇదీ చదవండి.కమేలా వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు