తెలంగాణ

telangana

ETV Bharat / state

TDP Contesting Issue on TS Assembly Election 2023 : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం.. నిరసన వ్యక్తం చేసిన కార్యకర్తలు - తెలంగాణలో టీడీపీ బ్రేకింగ్ న్యూస్

TDP Contesting Issue on TS Assembly Election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీలన్నీ పోటీపై ఉత్సుకతతో ముందుకు వెళ్తుంటే.. తెలుగు దేశం పార్టీ మాత్రం తన ఎన్నికల నిర్ణయంతో పార్టీ శ్రేణుల్లో నిరాశనే మిగిల్చిందని చెప్పొచ్చు. ఈ దఫా శాసనసభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు టీడీపీ అధిష్ఠానం ప్రకటించిన నిర్ణయం పట్ల శ్రేణుల నుంచి నిరసన గళం ఎదురైంది.

Kasani Gnaneshwar Gave TDP Clarity on Elections
TDP Contesting Issue on TS Assembly Elections

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2023, 6:35 PM IST

Updated : Oct 29, 2023, 7:53 PM IST

TDP Contesting Issue on TS Assembly Election 2023 : ఈసారి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఇవాళ ఎన్టీఆర్​ భవన్​లో(NTR Bhavan) ప్రకటించారు. ఈ ప్రకటన చేస్తూ కాసాని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయంతో కార్యకర్తలు నుంచి నిరసన జ్వాలలు రేకెత్తాయి. అధిష్ఠానం నిర్ణయంతో కాసాని జ్ఞానేశ్వర్‌ కన్నీటి పర్యంతమయ్యారు. రాజమండ్రి కారాగారంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్.. పార్టీ అధినేత చంద్రబాబుతో శనివారం ములాఖత్ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టి పెట్టలేమని చంద్రబాబు(Chandrababu Naidu) స్పష్టం చేశారు. ఏ పరిస్థితుల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందో నేతలకు వివరించాలని కాసానికి సూచించారు. చంద్రబాబు నిర్ణయాన్ని టీడీపీ సీనియర్ నేతలు తెలంగాణ నేతలకు వివరించారు. ఇదే విషయంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కాట్రగడ్డ ప్రసూన, జీవీజీ నాయుడు, సాయిబాబా సహా పలువురు నేతలు, జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.

TDP Clarity on Telangana Elections Contest : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయం

ఈ సందర్భంగా అధిష్టానం నిర్ణయం పట్ల పార్టీ నేతలు నిరసన తెలిపారు. పార్టీ కోసం అనుక్షణం కష్టపడింది ఎన్నికల కోసమే అని.. ఇప్పుడు తప్పుకోమనడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేయవద్దని లోకేశ్ చెప్పారన్నారు. మరోమారు కార్యకర్తల అభిప్రాయాన్ని బాబు దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు.

TDP Leader Nara Lokesh Emotional Speech: "ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తాం".. టీడీపీ నేతల ముందు లోకేశ్ కంటతడి

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును శనివారం ములాఖత్ అయ్యాను. అదేవిధంగా లోకేశ్, భువనేశ్వరి దేవిని కలవటం జరిగింది. చంద్రబాబు నాయుడుతో అన్ని మాటలు మాట్లాడిన తరవాత.. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకపోతే బాగున్ను అని చెప్పారు. దానికి మేము కుదరదని చెప్పాము. ఇంతకాలం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు.. ఇప్పుడు తప్పుకోమనడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశాను. దానిక వాళ్ల నుంచి వచ్చిన మాట.. పార్టీ అభ్యర్థులకు ఐదు, ఆరు వందల ఓట్లు కూడా రావని... ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. పార్టీ అభ్యర్థులు కచ్చితంగా గెలుస్తారని చెప్పాను. -కాసాని జ్ఞానేశ్వర్, టీటీడీపీ అధ్యక్షుడు

Kasani Gnaneshwar on Telangana Election : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని.. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ గతంలో ప్రకటించారు. దానికి అనుగుణంగానే తొలి విడత సన్నాహాల్లో 87 మంది అభ్యర్థుల జాబితాతో పాటు మేనిఫెస్టో(Manifesto) రూపకల్పన చేసి తమ వద్ద సిద్ధంగా ఉందన్నారు. కానీ ఇప్పుడు పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎన్నికల్లో తప్పుకోవడం పట్ల కాసాని కన్నీటి పర్యంతమయ్యారు. కార్యకర్తల నుంచి వస్తోన్న ఆందోళనలను బాబుకు మరోసారి విన్నవిస్తానని తెలిపారు.

TDP Contesting Issue on TS Assembly Election 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం.. నిరసన వ్యక్తం చేసిన కార్యకర్తలు

TDP Contests in Telangana Elections 2023 : 'తెలంగాణలో 87 స్థానాల్లో టీడీపీ పోటీ.. త్వరలోనే మేనిఫెస్టో విడుదల'

Last Updated : Oct 29, 2023, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details