CBN FIRES ON MINISTER AMBATI : "థింక్ ఏపీ థింక్" హ్యాష్‌ట్యాగ్‌తో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బాధిత కుటుంబానికి సాయంలో వాటా అడిగిన అంశం, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితిని ప్రస్తావించిన ఆయన.. "వీళ్లయ్యా మంత్రులు" అంటూ మండిపడ్డారు. బాధిత పేద కుంటుంబానికి వచ్చిన ఆర్థిక సాయంలో వాటా కొట్టేయడంపై ఉన్న పట్టుదల, శ్రద్ద, ఆరాటం.. ప్రాజెక్టులు కట్టడంపై మాత్రం లేదంటూ విమర్శించారు.
వీళ్లయ్యా మంత్రులు ..."థింక్ ఏపీ థింక్" హ్యాష్‌ట్యాగ్‌తో చంద్రబాబు ట్వీట్
CHANDRABABU TWEET : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నాయకులకు వాటాలు కొట్టేయటంపై ఉన్న పట్టుదల, శ్రద్ధ, ఆరాటం ప్రాజెక్టులు కట్టడంపై లేదని మంత్రి అంబటిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత వివాదం జరిగిన తర్వాత కూడా సత్తెనపల్లిలోని కుటుంబానికి చెక్ అందలేదని ధ్వజమెత్తారు. హ్యాష్‌ట్యాగ్ "థింక్ ఏపీ థింక్" పేరుతో ఆయన ట్వీట్ చేశారు.
CBN
ఇంత వివాదం తరువాత కూడా సత్తెనపల్లిలోని ఆ కుటుంబానికి చెక్ అందలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. సత్తెనపల్లిలో పేదల సాయంలో వాటా అడిగిన వివాదం, ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంపై ఈనాడులో వచ్చిన కథనాలను చంద్రబాబు తన ట్విట్టర్‌కు జతచేశారు.
ఇవీ చదవండి: