తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారంలోకి వచ్చాక.. జిల్లాలు సరిచేస్తాం : చంద్రబాబు - new districts news

పార్టీ నేతలతో పలు అంశాలపై తెదేపా అధినేత చంద్రబాబు చర్చలు జరిపారు. జగన్ విధానాలతో ఏపీ కూడా శ్రీలంకలా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని వద్ద ఉన్నతాధికారులు చేసిన వ్యాఖ్యలే.. రాష్ట్ర పరిస్థితికి దర్పణమన్నారు. ఇక, అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారన్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాలను సరిదిద్దుతామన్నారు.

chandrababu comments on districts
chandrababu comments on districts

By

Published : Apr 4, 2022, 3:45 PM IST

పార్టీ నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్​లో జగన్ పాలనపై ఆయన సొంత సామాజికవర్గం కూడా సంతృప్తిగా లేదన్న చంద్రబాబు.. వైకాపాకు ఓటేసి తప్పుచేశామనే భావన ఆయన సొంత వర్గంలోనే ఉందన్నారు. జగన్ విధానాలతో ఏపీ కూడా శ్రీలంకలా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రధాని వద్ద ఉన్నతాధికారుల వ్యాఖ్యలే.. రాష్ట్ర పరిస్థితికి దర్పణమన్నారు.

కొత్త జిల్లాలు సరిదిద్దుతాం:అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారన్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాలను సరిదిద్దుతామన్నారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రజల అభ్యంతరాలను, నిరసనలను కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని తప్పు పట్టారు. కరెంట్ చార్జీల మోత, పన్నుల భారంపై బాదుడే బాదుడు పేరుతో ఇంటింటికీ తెలుగుదేశం నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కరెంట్ ఎందుకు పోతోందో.. బిల్లు ఎందుకు పెరిగిందో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ వ్యక్తిగత ఆదాయం కోసమే.. ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నారని మండిపడ్డారు.

వారికి సంఘీభావం: అమరావతిలో 80 శాతం కంప్లీట్ అయిన పనులను కూడా పూర్తి చెయ్యలేని జగన్.. ఇప్పుడు మరో ఐదేళ్ల సమయం కోరడాన్ని తెదేపా నేతలు తప్పుబట్టారు. సీపీఎస్ రద్దు కోసం ఆందోళనలు చేస్తున్నవారికి సంఘీభావం తెలపాలని సమావేశంలో నిర్ణయించారు.

ABOUT THE AUTHOR

...view details