తెలంగాణ

telangana

ETV Bharat / state

తారకరత్నకు ఐసీయూలో చికిత్స.. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: చంద్రబాబు - విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి

Chandrababu Naidu on Tarakaratna Health Condition: బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెంగళూరులోని ఆసుపత్రికి చేరుకుని తారకరత్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Chandrababu Naidu
Chandrababu Naidu

By

Published : Jan 28, 2023, 10:07 PM IST

Chandrababu Naidu on Tarakaratna Health Condition: నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

తారకరత్నకు ఐసీయూలో చికిత్స.. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: చంద్రబాబు

'నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు కుప్పం వచ్చినప్పటికీ, అక్కడికంటే బెంగళూరులో ట్రీట్‌మెంట్‌ బెటర్‌గా ఉంటుందనే ఉద్దేశంతో డాక్టర్ల సలహా మేరకు రాత్రి 2గంటలకు ఇక్కడి తీసుకొచ్చారు. తారకరత్నను కాపాడేందుకు వైద్యులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నారు. వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోలుకోవడానికి ఇంకా టైమ్‌ పడుతుందని తెలిపారు. వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్‌ బులెటిన్‌ కూడా విడుదల చేస్తున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.'-చంద్రబాబు, టీడీపీ అధినేత

నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు, అభిమానుల్లో అందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తారకరత్న తండ్రి మోహన కృష్ణ, పురంధేశ్వరి, నందమూరి సుహాసిని ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు. నందమూరి అభిమానులు భారీగా తరలిరావడంతో నారాయణ హృదయాలయ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. తారక రత్న ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారని పురందేశ్వరి చెప్పారు. సోమవారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి, పరిస్థితి అంచనా వేస్తామని డాక్టర్లు చెప్పారని తెలిపారు. తారకరత్న తండ్రి మోహన్‌కృష్ణ, నందమూరి సుహాసిని, పరిటాల శ్రీరామ్‌ ఆసుపత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు.

ఏం జరిగిందంటే :చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్రలో కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు, కుటుంబసభ్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details