CBN Tour In Kuppam తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు పోలీసులు అడ్డు తగిలారు. కుప్పం నియోజకవర్గంలో అడుగుపెట్టిన కాసేపటికే అనుమతి లేదంటూ నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. నోటీసులు తీసుకునేందుకు నిరాకరించిన చంద్రబాబు ..తాఖీదులు ఎందుకు ఇస్తున్నారో రాత పూర్వక వివరణ ఇవ్వాలని కోరారు. తన పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వరని నిలదీశారు.
ఖబర్దార్ జగన్‌రెడ్డి.. మీ ఆటలు సాగనివ్వం: చంద్రబాబు - జగన్‌పై చంద్రబాబు ఫైర్

17:22 January 04
కుప్పం.. నా సొంత నియోజకవర్గం: చంద్రబాబు
CBN fire on JAGANబెంగళూరు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కుప్పం నియోజకవర్గం పరిధిలోని పెద్దూరు చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘ ఇది నా సొంత నియోజకవర్గం. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. గత నెలలో కుప్పం నియోజకవర్గానికి వస్తానని డీజీపీకి పర్యటన వివరాలు పంపించా. అక్కడి నుంచి ఎస్పీకి పంపించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 1 తీసుకొచ్చింది. సీఎం, పోలీసుల దయాదాక్షిణ్యాలతో మీటింగ్‌లు పెట్టాలని జీవో తెచ్చారు. నిన్న సీఎం మీటింగ్ పెట్టారు. రాజమహేంద్రవరంలో రోడ్లు బ్లాక్ చేశారు. విద్యా సంస్థలు మూసేశారు. ఆర్టీసీ బస్సులు వాడుకున్నారు. జగన్‌కు ఓ రూలు.. నాకు ఓ రూలా? జగన్ పని అయిపోయింది. ఇంకోసారి గెలవడు. ఇంటికి పోయే రోజులు దగ్గరికి వచ్చాయని భయపడే చీకటి జీవో తెచ్చారు. ప్రజా స్వామ్యంలో ప్రతి ఒక్కరూ తిరిగే స్వేచ్ఛ ఉంది. నా సొంత ఇంటికి నేను రాకుండా ఉండాలనే ఆంక్షలు పెట్టారు'' అని బాబు ఫైర్ అయ్యారు.
Chandrababu comments on jagan ''నా దగ్గర చాలా క్లియర్‌గా ఆధారాలు ఉన్నాయి. జగన్ పని అయిపోయింది. అందుకే ఈ పనికిమాలిన చర్యలకు పాల్పడుతున్నారు. కుప్పంలో నా పర్యటన ఎందుకు అడ్డుకుంటున్నారో లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని అడిగితే డీఎస్పీ వెళ్లి పోయారు. 1861 పోలీసు యాక్టు 30 ప్రకారం జీవో ఇచ్చామని చెబుతున్నారు. 1861 పోలీసు చట్టానికి 1946లో చేసిన సవరణను ప్రస్తావించలేదు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలంతా ప్రభుత్వం తీరుపై విసిగిపోయారు. ఎక్కడ రోడ్‌షో పెట్టినా వారి సమస్యలు చెప్పేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈనెల 2వ తేదీ జీవో ఇస్తారు.. ఒకటో తేదీ నుంచే జీవో అమల్లో ఉందని పలమనేరు డీఎస్పీ చెబుతారు.. ఇదే విధానం. ఏ చట్టం కింద నా నియోజకవర్గానికి నన్ను రానీయకుండా అడ్డుకుంటున్నావ్. నా నియోజకవర్గ ప్రజలతో మాట్లాడే హక్కులేదా? చీకటి జీవోలతో ఎమర్జెన్సీ విధించాలనుకుంటున్నారా? అందుకే చెప్పా.. సైకో పాలన పోవాలి.. సైకిల్ పాలన రావాలి. ఇది నా నియోజకవర్గం. కుప్పంలో ఎవరిని కదిలించినా తెలుగుదేశం గుండె చప్పుడు వినిపిస్తుంది. చట్టాన్ని గౌరవిస్తా. జగన్ మాదిరి హత్యా రాజకీయాలు చేయం. ప్రజాస్వామ్యం కోసం రాజకీయాలు చేస్తా. ప్రజలను కలవకుండా చేయాలని చూస్తే సహించను''- చంద్రబాబు, టీడీపీ అధినేత
CBN Warning to AP cm jagan: చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్న క్రమంలోనే పోలీసులు మరోసారి నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ‘‘నాకు మైక్ ఎందుకు ఇవ్వరు? రోడ్ షోకు అనుమతి ఎందుకివ్వరు? జవాబు చెప్పాలి. గతంలో నేను కుప్పం వచ్చినప్పుడు 74 మందిపై కేసులు పెట్టారు. 10మందిని జైల్లో పెట్టారు. నన్ను కూడా జైల్లో పెట్టండి అందులోనే ఉంటా. నేను రోడ్లపై మాట్లాడుతున్నా.. రోడ్లు తవ్వట్లేదు’’ అంటూ పోలీసుల తీరును చంద్రబాబు తప్పుబట్టారు. ప్రచార వాహనం తీసుకు రాకుంటే ఇక్కడే ధర్నా చేస్తానని హెచ్చరించారు. ప్రచార రథం తెచ్చే వరకు పెద్దూరులో పాదయాత్ర చేస్తానని అక్కడి నుంచి గ్రామంలోకి వెళ్లారు.
ఇవీ చూడండి: