TDP chief Chandrababu:పెట్టుబడుల ఆకర్షణలో దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలు ముందు వరుసలో ఉంటే ఆంధ్రప్రదేశ్ చిరునామా గల్లంతవడం శోచనీయమని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విచారం వ్యక్తంచేశారు. జగన్మోహన్ రెడ్డి ఏపీకి ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ఫెయిల్డ్ సీఎం అంటూ ట్వీట్ చేశారు.
"దక్షిణ భారత్‌లోని ప్రధాన రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. రాష్ట్రానికి జగన్ ఏంచేశారో సమాధానం చెప్పాలి. జ'గోన్'రెడ్డి ఫెయిల్డ్ సీఎం." -చంద్రబాబు
'అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి' అన్నట్లు ఏపీలో టమాట పంట పరిస్థితి ఉందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో కిలో టమాట ధర 3 రూపాయలకు పడిపోయి రైతు కంట కన్నీరు తెప్పిస్తోందన్నారు. వినియోగదారులు మాత్రం కిలో రూ.30కి పైనే పెట్టి కొనాల్సి వస్తోందని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు జగన్ రెడ్డి చెప్పిన ధరల స్థిరీకరణ నిధి ఏమైందని నిలదీశారు. దీనికి కేటాయిస్తానన్న రూ.3 వేల కోట్లు ఎటుపోయాయని మండిపడ్డారు. కనీస ధర లేక నష్టపోతున్న టమోటా రైతును ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
"అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్లుంది టమాట పరిస్థితి. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో కిలో టమాట రూ.3కు పడిపోయింది. వినియోగదారులు మాత్రం కిలో రూ.30కిపైనే పెట్టి కొనాల్సి వస్తోంది. రైతులను ఆదుకునేందుకు జగన్ చెప్పిన ధరల స్థిరీకరణ నిధి ఏమైంది?. ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు ఎటుపోయాయి?. నష్టపోతున్న టమాట రైతును ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి." -చంద్రబాబు
ఇవీ చదవండి: