తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నగారిపై అభిమానం అంటే అట్లుంటది మరి!!

ఎన్టీఆర్ అనే పేరు వింటే ఆయన పులకించిపోతారు.. వయసు 83 ఏళ్లు దాటినా ఎన్టీవోడిపై ప్రేమ పెరిగిందే తప్ప, తగ్గలేదంటారాయన.. అందుకే అన్నగారు దూరమైనా.. ఆయన పెట్టిన పార్టీకి నేనుసైతం అంటూ సేవ చేస్తున్నారు. తెదేపాపై మమకారంతో.. తెలుగుదేశం పార్టీ గుర్తుతో ప్రతిమలు తయారు చేస్తూ మహానాడు ప్రతినిధులకు అందించేందుకు సిద్ధమయ్యారు. మరి, ఆయనెవరు అన్నది చూడాలంటే.. ఈ వార్త చదవాల్సిందే!

tdp activist sayyad hussain peera
అన్నగారిపై అభిమానం అట్లుంటది మరి

By

Published : May 27, 2022, 1:39 PM IST

అన్నగారిపై అభిమానం అట్లుంటది మరి.. వందలాది తెదేపా బొమ్మల తయారీ!

మహానాడు కోసం తెలుగుదేశం పార్టీ ప్రతిమలు తయారుచేస్తున్నారు.. ఓ వీరాభిమాని. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కంభానికి చెందిన సయ్యద్‌ హుస్సెన్‌ పీరా.. పార్టీ పెట్టినప్పటి నుంచీ అందులోనే కొనసాగుతూ తన వంతు సేవలు అందిస్తూ వస్తున్నారు. సినీ తారకరాముడిపై ఎనలేని అభిమానం పెంచుకున్న పీరా.. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన తర్వాత.. ఆ పార్టీకి వీరాభిమానిగా ఉంటున్నారు.

పార్టీపై అభిమానంతో.. తెదేపా జెండా గుర్తుతో ప్రతిమలను తయారుచేస్తున్నారు. ప్రస్తుతం మహానాడుకు వచ్చిన ప్రతినిధులకు అందించేందుకు.. 150 ప్రతిమలను సిద్ధం చేశారు. ఇప్పటివరకు దాదాపుగా 750 ప్రతిమలు తయారుచేసినట్లు తెలిపిన పీరా.. తుదిశ్వాస ఉన్నంత వరకు పార్టీతోనే ఉంటానని అంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details