తెలంగాణ

telangana

ETV Bharat / state

'గ్రీన్​ ఛాలెంజ్​ స్వీకరించిన టీసీఎస్​ వైస్​ ప్రెసిడెంట్​' - Green Challenge Latest news

గ్రీన్​ ఛాలెంజ్​లో భాగంగా టీసీఎస్​ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ రాజన్న తమ కార్యాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. సైబరాబాద్​ సీపీ సజ్జనార్ ఆయనకు గ్రీన్​ ఛాలెంజ్​ చేశారు.

TCS VP Rajanna
TCS VP Rajanna

By

Published : Feb 16, 2020, 7:01 PM IST

సైబరాబాద్ సీపీ సజ్జనార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్​ను టీసీఎస్​ వైస్​ ప్రెసిడెంట్​ రాజన్న స్వీకరించారు. మంత్రి కేటీఆర్​ ట్వీట్​కు స్పందిస్తూ కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని తమ కార్యాలయ ఆవరణలో మొక్కను నాటి సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం మొక్కలు నాటాలంటూ... పలు విద్యా, సాఫ్ట్​వేర్​ సంస్థల డైరెక్టర్​లకు ఛాలెంజ్ విసిరారు.

హరితహారం గొప్ప కార్యక్రమం అని... అందరూ ఇందులో భాగస్వాములవ్వాలని అని ఆయన కోరారు. మొక్కలు నాటేందుకు వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని... పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన చెప్పారు.

గ్రీన్​ ఛాలెంజ్​ స్వీకరించిన టీసీఎస్​ వైస్​ ప్రెసిండెంట్

ఇదీ చదవండి :'కవల పిల్లల నడుమ కేసీఆర్​ పుట్టినరోజు వేడుకలు'

ABOUT THE AUTHOR

...view details