గిరిజనుల అభ్యున్నతికి చేపడుతున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పిలుపునిచ్చారు. గిరిజన యువత ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ది చెందాలని సూచించారు.
' సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలి' - మంత్రి సత్యవతి రాఠోడ్ వార్తలు
డ్రైవర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రాం కింద 31 మంది గిరిజన డ్రైవర్లకు మంత్రి సత్యవతి రాఠోడ్ కార్లు పంపిణీ చేశారు. గిరిజనుల అభ్యున్నతికి చేపట్టిన పథకాలు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.
'గిరిజనుల అభ్యున్నతికి చేపట్టిన పథకాలు వినియోగించుకోవాలి'
హైదరాబాద్‌లో గిరిజన సంక్షేమశాఖ-ట్రైకార్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. డ్రైవర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రాం కింద 31మంది గిరిజన డ్రైవర్లకు కార్లు పంపిణీ చేశారు. కార్యక్రమం అమలులో భాగస్వాములైన ఉబెర్, మారుతి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి:వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డుల స్వాధీనానికి ప్రభుత్వం ఆదేశం