తెలంగాణ

telangana

ETV Bharat / state

State Taxes income: పెరిగిన ఆదాయం.. తొలిసారి లక్ష కోట్ల మార్కు దాటిన పన్ను రాబడి - 2021-22 ఆర్థిక ఏడాదిలో పెరిగిన పన్నుల ఆదాయం

State Taxes income:అధిగమించింది. లక్షా ఆరు వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా... లక్షా తొమ్మిది వేల కోట్లకు పైగా రాష్ట్ర ఖజానాకు వివిధ పన్నుల ద్వారా జమ అయ్యాయి. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రుణాలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వానికి లక్షా 75వేల కోట్లు సమకూరగా లక్షా 66 వేల కోట్ల వ్యయం చేసింది.

State Taxes
State Taxes

By

Published : May 13, 2022, 5:09 AM IST

Updated : May 13, 2022, 5:42 AM IST

State Taxes income: మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా గణనీయమైన ఆదాయం వచ్చింది. తొలిసారిగా పన్ను ఆదాయం లక్ష కోట్ల రూపాయల మార్కును అధిగమించింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - కాగ్ కు రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన వివరాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. బడ్జెట్‌లో పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని 1,06,900 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అన్ని రకాల పన్నుల ద్వారా రాష్ట్ర ఖజానాకు 1,09,991 కోట్ల రూపాయలు సమకూరాయి. బడ్జెట్ అంచనాలకు 102 శాతం సాధించింది. జీఎస్​టీ ద్వారా రూ.34,489 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.12,372 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.26,973 కోట్లు వచ్చాయి.

ఆబ్కారీ ద్వారా రూ.17,482 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా 13,147 కోట్ల రూపాయలు సమకూరాయి. ఇతర పన్నుల ద్వారా మరో 5,525 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా భారీగా పెరగడంతో పాటు అమ్మకంపన్ను, ఎక్సైజ్ ఆదాయం బడ్జెట్ అంచనాల కంటే అధికంగా వచ్చింది. పన్నేతర ఆదాయం, గ్రాంట్లకు సంబంధించి మాత్రం బడ్జెట్ అంచనాలకు, వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉంది. రూ.30,557 కోట్ల పన్నేతర ఆదాయం అంచనా వేయగా కేవలం రూ.8,857 కోట్లు మాత్రమే వచ్చాయి. 38,669 కోట్ల రూపాయలు గ్రాంట్ల రూపంలో వస్తాయని అంచనా వేయగా... కేవలం 8,619 కోట్లు మాత్రమే సమకూరాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 47,690 కోట్ల రూపాయలు రుణాలు తీసుకొంది. ఖజానాకు సమకూరిన మొత్తం బడ్జెట్ అంచనా 2,21,686 కోట్లకు గాను 79 శాతం మేర 1,75,206 కోట్లు జమయ్యాయి.

పెరిగిన ఆదాయం.. తొలిసారి లక్ష కోట్ల మార్కు దాటిన పన్ను రాబడి

గడచిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 1,66,737 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఉద్యోగుల జీతాల కోసం రూ.30,375 కోట్లు, వడ్డీల చెల్లింపుల కోసం రూ.18,688 కోట్లు, పెన్షన్లకు రూ.14,027 కోట్లు, రాయితీలకు రూ.10,218 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. నికరంగా 29,002 కోట్ల రూపాయలు ప్రాథమిక లోటు నమోదైంది. నెలల వారీగా చూస్తే ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వానికి గరిష్టంగా 12,820 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. పన్నేతర ఆదాయం మార్చిలో ఏకంగా 2,776 కోట్ల రూపాయలు సమకూరింది.

ఇవీ చూడండి:ఐస్​క్రీం తిని ఫ్లేవర్ చెప్తే చాలు.. మీరే లక్షాధికారి..!

సరూర్​నగర్ తరహాలో మరో పరువు హత్య.. మతాంతర ప్రేమ వల్లే..

Last Updated : May 13, 2022, 5:42 AM IST

ABOUT THE AUTHOR

...view details