తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రైవేటు ట్రావెల్స్​కు టాక్స్​ మినహాయింపు ఇవ్వాలి' - లాక్​డౌన్​లోనూ రోడ్డు పన్ను కట్టాలని

లాక్​డౌన్ సమయంలో ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలకు రోడ్డు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని వారు హెచ్చార్సీకి ఫిర్యాదు చేశారు. స్వీకరించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.

Tax exemption for private travel state hrc in hyderabad
'ప్రైవేటు ట్రావెల్స్​కు టాక్స్​ మినహాయింపు ఇవ్వాలి'

By

Published : May 20, 2020, 7:13 PM IST

లాక్​డౌన్​లోనూ రోడ్డు పన్ను కట్టాలని తమను ఆర్టీఏ అధికారులు వేధిస్తున్నారంటూ ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు హెచ్చార్సీకి ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాయి. ట్రావెల్స్ వాహనాలకు కొన్ని రోజుల వరకు పన్ను చెల్లించకుండా మినహాయింపు ఇచ్చేలా రవాణా శాఖను ఆదేశించాలని కోరాయి.

ఫిర్యాదును స్వీకరించిన హెచ్చార్సీ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. రోడ్డు పన్ను బకాయిల పేరుతో వాహనదారులను ఆర్టీఏ అధికారులు ఇబ్బందులకు గురి చేయొద్దంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది.

ఇదీ చూడండి :పెట్రోల్​ బంక్​ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు

ABOUT THE AUTHOR

...view details