తెలంగాణ

telangana

ETV Bharat / state

వృషభ రాశి వారికి ప్లవ నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

తెలుగు నూతన సంవత్సవం ఆరంభమైంది. షడ్రుచులతో జీవిత సారాన్ని తెలియజేసే ఈ పండుగ పంచాంగం రూపంలో భవిష్యత్​ను గురించి కొన్ని సూచనలు చేస్తుంది. మరి ఈ ప్లవ నామ సంవత్సవం వృషభ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం రండి.

taurus astrology, plava astrology
వృషభ రాశిఫలం, ప్లవ నామ సంవత్సరం రాశి ఫలాలు

By

Published : Apr 13, 2021, 10:46 AM IST

  • ఆదాయం-2
  • వ్యయం-8
  • రాజపూజ్యం-7
  • అవమానం-3

వృషభ రాశి వారికి గ్రహబలం తక్కువగా ఉంది. శ్రమ అధికమవుతుంది. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. అనుకున్న లక్ష్యాన్ని చేరేవరకూ శ్రమిస్తూనే ఉండండి. మొహమాటం ఇబ్బంది పెడుతుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలి. పనితీరును మెరుగుపరుచుకోవటం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. ఒత్తిడిని తట్టుకుంటూ ముందుకు సాగాలి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి వస్తుంది. ఆత్మీయుల సూచనలు శక్తినిస్తాయి. వ్యయం పెరగకుండా చూసుకోవాలి. వ్యాపారంలో స్వయంకృషి అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. గురు, శని శ్లోకాలు చదువుకోవాలి. ధర్మం సదా రక్షిస్తుంది, ధైర్యంగా ముందుకుసాగండి.

ABOUT THE AUTHOR

...view details