తెలంగాణ

telangana

ETV Bharat / state

పబ్​లపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు ప్రత్యేక నిఘా - police rides on pubs

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పబ్‌లలో టాస్క్‌ఫోర్స్​ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో వివిధ పబ్‌లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

task force police rides on pubs in Hyderabad
పబ్​లపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు ప్రత్యేక నిఘా

By

Published : Dec 31, 2019, 11:24 PM IST

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పబ్​లపై ప్రత్యేక నిఘా పెట్టారు. జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. పబ్‌లలో అనువనువూ జల్లెడ పట్టారు. నగరంలో ఇటీవల మాదకద్రవ్యాలు పట్టుబడడం వల్ల... ముందస్తుగా ఆయా పబ్‌లలో తనిఖీలు చేసినట్టు అధికారులు తెలిపారు. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు పబ్‌లు, బార్‌లలో అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

పబ్​లపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు ప్రత్యేక నిఘా

ABOUT THE AUTHOR

...view details