హైదరాబాద్‌లోని మారేడుపల్లి, రామ్‌గోపాల్ పేట పరిధిలో పండ్లను నిల్వచేస్తున్న గోదాములపై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. విషరసాయనాలు ఉపయోగించి పండ్లను మగ్గిస్తున్నారన్న సమాచారంతో వ్యవసాయ అధికారులతో కలిసి సోదాలు చేశారు. మామిడి, బొబ్బాయి పండ్లను కృత్రిమంగా మగ్గించడానికి చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఇథలిన్ కెమికల్ పౌడర్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. దాడుల్లో నలుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి ఏడు లక్షల విలువైన రసాయన పదార్థం, మగ్గించిన పండ్లను స్వాధీనం చేసుకున్నారు.
విష రసాయనాలతో పండ్లను మగ్గిస్తున్న ముఠా అరెస్ట్ - పండ్లను మగ్గిస్తున్న గోడౌన్లపై టాస్క్‌ఫోర్స్ దాడులు
మారేడుపల్లి, రామ్‌గోపాల్ పేట ఠాణాల పరిధిలో విష రసాయనాలు ఉపయోగించి పండ్లను మగ్గిస్తున్న గోదాములపై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. ఏడు లక్షల రూపాయల విలువైన రసాయన పదార్థాలతో పాటు పండ్లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌కు చెందిన దాసరి వెంకటేశ్, ఇంత్యజ్ అలీ, ఇసాక్, అమిత్ అగర్వాల్ ముఠాగా ఏర్పడి ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారిలో వెంకటేశ్, ఇంతియాజ్ అలీ... మారేడుపల్లిలో పండ్ల వ్యాపారం చేస్తుండగా... అమిత్ అగర్వాల్ ఈ రసాయనాలను కొనుగోలు చేసి ఏజెంట్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇథనల్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించినప్పటికీ... అక్రమంగా తీసుకొచ్చి పండ్లను త్వరగా మగ్గేందుకు ఉపయోగిస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి :మృతదేహాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి