రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని భాజపా(bjp) రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్(tarun chugh) ధీమా వ్యక్తం చేశారు. ఆ దిశగా పార్టీ నేతలంతా ఆత్మవిశ్వాసంతో కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారని అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay), జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(dk aruna), ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్(k.laxman), మధ్యప్రదేశ్ ఇంఛార్జి మురళీధర్‌రావు తదితరులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
tarun chugh: రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయం - తెలంగాణ వార్తలు
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని భాజపా(bjp) రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్(tarun chugh) అన్నారు. ఆ దిశగా పని చేస్తున్నామని తెలిపారు. పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలను టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు.
భాజపా నేతల టెలీ కాన్ఫరెన్సు, తరుణ్ చుగ్ తాజా వ్యాఖ్యలు
బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని అందరూ కోరుకుంటున్నారని తెలిపారు. కల్యాణ్ సింగ్(kalyan singh) మృతి పట్ల సంతాప దినాలు ప్రకటించారని... అందుకోసమే ప్రజా సంగ్రామ యాత్రను 24నుంచి 28కి వాయిదా వేయాల్సిందిగా కోరాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో కల్యాణ్ సింగ్ సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం రాష్ట్రంలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
ఇదీ చదవండి:HARISH RAO: 'భాజపా హయాంలో దేశం బంగ్లాదేశ్‌తో కూడా పోటీపడలేకపోతోంది'