హుజురాబాద్ ఉప ఎన్నిక(Huzurabad by election).. తెలంగాణ ప్రజలకు, కేసీఆర్ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరుగా భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్(Tarun Chugh) అభివర్ణించారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కుటుంబసభ్యులకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ఈటల(Etela) కచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ అహంకారాన్ని అణిచి వేసే రోజులు రానే వచ్చాయన్నారు.
రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలను అంతం చేస్తాం. హుజూరాబాద్‌లో కమల వికాసం ఖాయం. కేసీఆర్.. మాయ మాటలతో రైతులను, యువతను మోసం చేశారు. కేంద్రం.. డిసెంబర్ నాటికి దేశంలో 200 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ప్రజలంతా కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.