తెలంగాణ

telangana

ETV Bharat / state

అదే నిజమైతే.. కేసీఆర్ గుడికి వెళ్లి ప్రతిజ్ఞ చేయ్: తరుణ్ చుగ్ - కేసీఆర్‌పై తరుణ్ చుగ్ కామెంట్స్

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై భాజపా తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌చుగ్‌ మండిపడ్డారు. తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు భాజాపా ప్రయత్నిస్తోందంటూ... కేసీఆర్ అన్ని కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు. తన ఫాంహౌస్‌లో సినిమా కథ అల్లారని విమర్శించారు.

TARUN CHUG ON TRS MLAS BUYING ISSUE
TARUN CHUG ON TRS MLAS BUYING ISSUE

By

Published : Nov 4, 2022, 9:38 PM IST

తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భాజపా యత్నిస్తోందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ఆరోపణలను భాజపా తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌చుగ్‌ కూడా ఖండించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుతో భాజపాకు ఎలాంటి సంబంధం లేదని..... ఆయన తేల్చిచెప్పారు. కేసీఆర్‌.. తన ఫాంహౌస్‌లో సినిమా కథ అల్లారని విమర్శించారు. కేసీఆర్‌ సర్కారు పాపాలకు ప్రజలు తప్పకుండా బదులిస్తారని పునరుద్ఘాటించారు.

అదే నిజమైతే.. కేసీఆర్ గుడికి వెళ్లి ప్రతిజ్ఞ చేయ్: తరుణ్ చుగ్

''సీఎం టీవీ ముందుకు వచ్చి... మా ఎమ్మెల్యేలను కొంటున్నారు? పార్టీని పడగొట్టాలని చూస్తున్నారని చెప్పిన ముఖ్యమంత్రిని... నేను మొదటిసారి చూస్తున్నాను. కేసీఆర్‌గారూ అసలు మీరే పాపం చేశారు? రాత్రి నిద్రపోతున్నా.... మీ పార్టీ అమ్ముడుపోతోందని మీకు అనిపిస్తోంది. మీ పార్టీ, రాష్ట్రం, ప్రజల మనస్సు మీ నుంచి దూరమైపోతునట్లు.... మీకు ఎందుకు అనిపిస్తోంది? నిజానికి.. మీ పాపాలే మీతో ఇలా మాట్లాడిస్తున్నాయి. 8 ఏళ్లలో.. మీరంతా విలాసవంతమైన జీవనం గడిపారు. ప్రజలంతా భగవంతుడిపై భారం వేశారు. కొవిడ్‌ సమయంలో విలాసవంతమైన ఫామ్‌ హౌస్‌లో ఉన్నారు. ఆ పాపాలే ఇప్పుడు మాట్లాడుతున్నాయి. అవే... భారంగా మారాయి. ఎమ్మెల్యేల కొనుగోలు పూర్తిగా అబద్ధం. అదే నిజమైతే.... గుడికి వెళ్లి ఎందుకు ప్రతిజ్ఞ చేయడం లేదు? - తరుణ్‌చుగ్‌, భాజపా రాష్ట్రవ్యవహరాల ఇన్‌ఛార్జి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details