తెలంగాణ

telangana

ETV Bharat / state

'కోటి 83 లక్షల ఈత, కర్జూర మెుక్కలు నాటడమే లక్ష్యం' - డ్రిప్ ఇరిగేషన్

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో విధిగా 3 నుంచి 6 వేల ఈత, కర్జూర మెుక్కలు నాటాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నాటించడం ద్వారా కూలీలకు ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు.

లక్షల సంఖ్యలో ఈత, తాటి మెుక్కలు నాటాలి : శ్రీనివాస్ గౌడ్

By

Published : Aug 14, 2019, 12:02 AM IST

5వ విడత హరితహారంలో భాగంగా అబ్కారీ శాఖ ద్వారా ఒక కోటి 83 లక్షల ఈత, కర్జూర మెుక్కలు నాటాలనే లక్ష్యం పెట్టుకున్నామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ తెలిపారు. ఇప్పటికే దాదాపు 35లక్షలు నాటినట్లు వెల్లడించారు. కొన్ని చోట్ల డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాన్ని కల్పించామని పేర్కొన్నారు. దీని వల్ల ఈత, కర్జూర మెుక్కలు ఏపుగా పెరిగి కల్లు ఉత్పత్తి వేగంగా జరిగేందుకు దోహదపడుతుందని వెల్లడించారు.
గీత వృత్తిదారుల సోసైటీ భూములు, ప్రభుత్వ, అటవీ భూములు, చెరువు గట్లల్లో లక్షల సంఖ్యలో ఈ మెుక్కలను నాటాలని అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.

లక్షల సంఖ్యలో ఈత, తాటి మెుక్కలు నాటాలి : శ్రీనివాస్ గౌడ్

ABOUT THE AUTHOR

...view details