16 సీట్ల గెలుపే లక్ష్యం - TRS PRESIDENT KCR
సార్వత్రిక ఎన్నికల్లో తెరాస 16 లోక్సభ స్థానాలను కైవసం చేసుకుని కేంద్ర ప్రభుత్వంలో నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని తెరాస నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
దేశంలో గుణాత్మకమైన మార్పు కోసమే కేసీఆర్ : బూర నర్సయ్య
హైదరాబాద్ నాగోల్లో భువనగిరి పారిశ్రామిక ప్రగతి నివేదన సభ నిర్వహించారు. కేంద్రంలో తెరాస అధినేత కేసీఆర్ కీలక పాత్ర పోషించాలంటే 16 ఎంపీ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నేత బూర నర్సయ్య గౌడ్ తెలిపారు.
దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలంటే కేంద్ర పాలనా వ్యవహారాల్లో కేసీఆర్ పాత్ర ఉండాలని పేర్కొన్నారు. అభివృద్ధిపై నేటి తెలంగాణ ఆలోచనలే రేపటి దేశ ఆచరణ అని వెల్లడించారు.