ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవిలోని పురాతన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సినీ నటుడు నందమూరి తారకరత్న దర్శించుకున్నారు. బూదగవి వచ్చిన తారకరత్నకు గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. కుటుంబసమేతంగా తారకరత్న.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన.. మండలంలోని నింబగల్లు గ్రామ శివారులో ఉన్న భగలముఖి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
బూదగవి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో తారకరత్న - ఉరవకొండ వార్తలు
సినీ నటుడు నందమూరి తారకరత్న.. కుటుంబసభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్లోని బూదగవి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బూదగవి సూర్యనారాయణ స్వామి, తారకరత్న