తెలంగాణ

telangana

ETV Bharat / state

విషమంగానే తారకరత్న ఆరోగ్యం.. హెల్త్​ బులిటెన్‌ విడుదల చేసిన వైద్యులు - విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి

Nandamuri Tarakaratna Health Bulletin: నందమూరి తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తున్నామని తెలిపారు.

Nandamuri Tarakaratna Health Bulletin
Nandamuri Tarakaratna Health Bulletin

By

Published : Jan 30, 2023, 10:07 PM IST

Nandamuri Tarakaratna Health Bulletin: సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు నారాయణ హృదయాలయ ఆస్పత్రి యాజమాన్యం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తున్నామని తెలిపారు.

విషమంగానే తారకరత్న ఆరోగ్యం.. హెల్త్​ బులిటెన్‌ విడుదల చేసిన వైద్యులు

Nandamuri Ramakrishana: తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని నందమూరి రామకృష్ణ తెలిపారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను పరామర్శించిన అనంతరం.. ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడారు. దురదృష్టవశాత్తు ఇలా జరిగిందని ఆయన అన్నారు. తారకరత్న శరీర అవయవాలన్నీ బాగా పని చేస్తున్నాయని.. ఈ రోజు మధ్యాహ్నం వైద్యులు సిటీ స్కాన్ చేశారన్నారు.

గుండె, లివర్ ఇతర అవయవాలన్నీ నార్మల్ స్థితికి వచ్చాయి. పార్షియల్ వెంటిలేషన్ మీద వైద్యులు చికిత్స అందిస్తున్నారు. న్యూరో రికవరీ కావడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. నైపుణ్యత కలిగిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వైద్యుల ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. త్వరలోనే తారకరత్న కోలుకుని మన ముందుకు వస్తారు. తారకరత్న ఆరోగ్యం బాగుండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నా. -నందమూరి రామకృష్ణ

ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న కొద్ది దూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయిన సంగతి తెలిసిందే. వెంటనే యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. వైద్యులు, కుటుంబ సభ్యుల సూచన మేరకు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌, ఇతర స్పెషలిస్టుల వైద్య బృందం పర్యవేక్షణలో ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details