ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా వైకాపా నేతల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై తణుకు వైకాపా ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా పర్యటనలు చేస్తున్నారని అన్నారు. తణుకులో మీడియాతో ఆయన మాట్లాడారు.
రఘురామకృష్ణరాజుపై వైకాపా ఎమ్మెల్యే సంచలన వ్యాక్యలు - mp raghu rama krishna raju latest news
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏపీ పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో బాధ్యతలు మర్చిపోయిన ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అది నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజేనని వ్యాఖ్యానించారు. మతాల పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కరోనా మొదలైనప్పటి నుంచి నరసాపురం ఎంపీ హైదరాబాద్, దిల్లీలో ఉంటున్నారు. ఆయనను నియోజకవర్గ ప్రజలు మరిచిపోయేలా వ్యవహరిస్తున్నారు. దేశంలో బాధ్యతలు మర్చిపోయిన ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అది రఘురామకృష్ణరాజు మాత్రమే. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎంపీగా ఆయనకేమీ పట్టడంలేదు. నిన్నమొన్నటి వరకు కులాల పేరుతో చిచ్చు పెట్టిన ఆయన తాజాగా మతాల పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆడించే బొమ్మలా మారారు. ఆయనకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడాలి. ఆయనకు పోటీగా మా పార్టీ తరఫున ఒక వాలంటీర్‌ను పోటీగా నిలబెట్టి గెలిపించుకోగలగం-కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తణుకు ఎమ్మెల్యే
ఇదీ చదవండి: ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్‌తో అయోధ్యలో హైఅలర్ట్