తెలంగాణ

telangana

ETV Bharat / state

టంగుటూరి అంజయ్య 36వ వర్ధంతి.. నివాళులర్పించిన కాంగ్రెస్​ నేతలు - telangana latest news

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ టంగుటూరి అంజయ్య 36వ వర్ధంతి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్​లో ఘనంగా నిర్వహించింది. లుంబినీ పార్కులోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్ హనుమంతరావు, అంజన్​కుమార్ యాదవ్, మహేశ్​ గౌడ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు.

anjaih
anjaih

By

Published : Oct 18, 2022, 4:14 PM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ టంగుటూరి అంజయ్య 36వ వర్ధంతిని కాంగ్రెస్ నేతలు హైదరాబాద్​లో ఘనంగా నిర్వహించారు. లుంబినీ పార్కులోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్ హనుమంతరావు, అంజన్​కుమార్ యాదవ్, మహేశ్​ గౌడ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు.

అంచెలంచులుగా ఎదిగిన అంజయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పని చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. తన సహయంతో ఎన్నో పథకాలను సంస్కరణలు తీసుకువచ్చారని.. అలాగే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పాటుపడ్డ మహానాయకుడని కొనియాడారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details