ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

తానా ఫౌండేషన్‌ సేవలు విస్తృతం చేస్తాం: ఛైర్మన్‌ నిరంజన్‌ - తానా ఫౌండేషన్ సేవల వార్తలు

తానా సేవలను తెలుగు రాష్ట్రాల్లో మరింత విస్తృతం చేయనున్నట్లు తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌ నిరంజన్‌ శృంగవరపు తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో మార్చి నుంచి తెలుగు రాష్ట్రాల్లో తానా ఫౌండేషన్‌ ద్వారా రూ.5 కోట్ల నిధులను ఖర్చు చేసినట్లు నిరంజన్ వెల్లడించారు. మారుమూల గ్రామాల్లోని మూడు లక్షల కుటుంబాలకు నిత్యావసరాల కిట్లు, ఐదు లక్షల మందికి మాస్కులు పంపిణీ చేసినట్లు వివరించారు.

tana-foundation-chairman-niranjan-shringavarapu-said-that-tana-services-will-be-further-expanded-in-the-telugu-states
తానా ఫౌండేషన్‌ సేవలు విస్తృతం చేస్తాం: ఛైర్మన్‌ నిరంజన్‌
author img

By

Published : Oct 28, 2020, 10:10 AM IST

తెలుగు రాష్ట్రాల్లో తానా సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌ నిరంజన్‌ శృంగవరపు తెలిపారు. ఆయన తల్లి ఇంద్రావతి ప్రథమ వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా శిరువెళ్ల మండలం రాజనగరంలో విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, మహిళలకు చీరలు మంగళవారం పంపిణీ చేశారు.

కొవిడ్‌ నేపథ్యంలో మార్చి నుంచి తెలుగు రాష్ట్రాల్లో తానా ఫౌండేషన్‌ ద్వారా రూ.5 కోట్ల నిధులను ఖర్చు చేసినట్లు నిరంజన్ తెలిపారు. తాను సొంతంగా సుమారు రూ.70 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. మారుమూల గ్రామాల్లోని మూడు లక్షల కుటుంబాలకు నిత్యావసరాల కిట్లు, ఐదు లక్షల మందికి మాస్కులు పంపిణీ చేసినట్లు వివరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకే విజయావకాశాలు ఉన్నట్లు తాను వ్యక్తిగతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఐదు లక్షల మందికి పైగా తెలుగువారు ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:రాజేంద్రనగర్‌లో మరో కిడ్నాప్ కలకలం

ABOUT THE AUTHOR

author-img

...view details