Governer At Salarjung Museum: సాలార్జంగ్ మ్యూజియం బోర్డు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. సాలార్జంగ్ మ్యూజియంలో రెండు గ్యాలరీలను ప్రారంభించారు. 1968లో సాలార్జంగ్ మ్యూజియం కింది ఫ్లోరులో ప్రారంభించిన బ్రాంజ్, దక్షిణ భారత గ్యాలరీలను.. సాలార్ జంగ్ మ్యూజియం బోర్డు సభ్యులు, జితేందర్ కరాపే, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నవాబ్ అహ్థెరమ్ అలీఖాన్ తదితరుల సమక్షంలో.. ఈ రోజు ఉదయం పునః ప్రారంభించారు.
సాలార్జంగ్ మ్యూజియంలో రెండు కొత్త గ్యాలరీలను ప్రారంభించిన గవర్నర్..తమిళసై
Governer Open Two Galleries At Salarjung Museum: సాలార్జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన రెండు కొత్త గ్యాలరీలను ఈరోజు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రారంభించారు. ఈ ఆర్ట్ గ్యాలరీలో దక్షిణ భారతదేశానికి చెందిన వస్తువులను ప్రదర్శనకు ఉంచినట్లు బోర్డు సభ్యులు తెలిపారు.
గంధంతో చేసిన దేవుళ్లు, దేవతల చిత్రాల గొప్ప సేకరణ, రోజ్‌వుడ్ ఫర్నీచర్, ఇత్తడి ఫలకాలతో అందంగా చెక్కిన క్యాబినెట్‌లు, క్లాక్ కేస్‌లు వంటివి ఈ దక్షిణ భారత మైనర్ ఆర్ట్ గ్యాలరీలో లభించనున్నట్లు సాలార్జంగ్ మ్యూజియం బోర్డు సభ్యులు తెలిపారు. కంచు పని అభివృద్ధి చెందిన 9 నుంచి 13వ శతాబ్దాల చోళుల కాలంలో, విజయనగర రాజుల పాలనలో బాగా కొనసాగింది. 14వ శతాబ్దానికి చెందిన విజయనగర కాలం నాటి నటరాజుని నాలుగు అడుగుల ఎత్తైన చిత్రం కూడా కంచు గ్యాలరీలో ఉన్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: