Governor Tamilisai visited Kashi Tamil Sangamam: కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అకడమిక్ సెషన్‌లో కాశీ - తమిళనాడు మధ్య ఉన్న చారిత్రక సంబంధాలపై వక్తలు చర్చించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీహెచ్‌యూలోని యాంపి థియేటర్ గ్రౌండ్‌లో నిర్వహించిన తమిళ సంగమం సెమినార్‌లో తమిళిసై సౌందరరాజన్ తమిళనాడు, కాశీ సంస్కృతి, భాష, దక్షిణ, ఉత్తర భారత ప్రజల సమానత్వంపై చర్చించారు.
కాశీ తమిళ సంగమం ఉత్సవాలలో పాల్గొన్న గవర్నర్ కాశీ తమిళ సంగమం ఉత్సవాల ద్వారా ఉత్తరాది, దక్షిణాది సంస్కృతుల సంగమం అద్భుతంగా, విశిష్టంగా కనిపిస్తోందని గవర్నర్ తమిళిసై అన్నారు. రెండు ప్రాంతాల సంస్కృతి ఒకేలా ఉంటుందన్న గవర్నర్... ఇరు ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆత్మ ఒక్కటేనన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దార్శనికత ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్‌కు.. కాశీ తమిళ సంగమం పెద్ద ఉదాహరణ అని అన్నారు. ఇందులో ఉత్తర, దక్షిణ భారత సంస్కృతి సంగమం కనిపిస్తోందని పేర్కొన్నారు.
కాశీ తమిళ సంగమం ఉత్సవాలలో పాల్గొన్న గవర్నర్ కాశీ, తమిళం మధ్య శతాబ్దాల నాటి అనుబంధం ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీనికి కొత్త రూపాన్ని ఇచ్చారన్నారు. గొప్ప కవి సుబ్రమణ్యం భారతి ప్రజాదరణ బీహెచ్‌యూలో కనిపించిందన్న గవర్నర్... ఆయన ఉత్తర, దక్షిణాలను అనుసంధానించడానికి అతిపెద్ద ఉదాహరణగా పేర్కొన్నారు. అలాగే వ్యక్తిగత అనుభవాలను ప్రస్తావిస్తూ 20 ఏళ్ల తర్వాత కాశీకి వచ్చానని చెప్పారు. గంగా నదిలో చాలా మార్పు చూశానన్న ఆమె... నగరం, గంగానది రెండూ శుభ్రంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ద్వారా ఉత్తరాది, దక్షిణాది సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలు ఒకదానికొకటి కలుస్తున్నాయన్నారు.
తమిళనాడులో "అప్పటి కాశీ, శివ కాశీ" వంటి నగరాలు ఉన్నాయని గవర్నర్ తెలిపారు. పుదుచ్చేరిలో కూడా కాశీ విశ్వనాథ ఆలయం ఉందన్న ఆమె.. వాటి గురించి తప్పక తెలుసుకోవాలని సూచించారు. తమిళనాడులోని అనేక గ్రామాలలో కాశీ విశ్వనాథ దేవాలయాలు నిర్మించబడ్డాయని పేర్కొన్నారు. తమిళనాడు, కాశీ ఒకదానికొకటి బాగా సంబంధం కలిగి ఉన్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
ఇవీ చదవండి: