గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. పుదుచ్చేరిలో పర్యటిస్తున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆ రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించారు. అక్కడ ఆమె కొండ చిలువను పట్టుకున్నారు. కొండ చిలువను పట్టుకోవడం థ్రిలింగ్గా, ప్రత్యేకంగా ఉందని గవర్నర్ ట్వీట్ చేశారు.
కొండ చిలువను పట్టుకున్న గవర్నర్ తమిళిసై - గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తాజా వార్తలు
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొండ చిలువను పట్టుకున్నారు. ఆ ఫొటోను ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
![కొండ చిలువను పట్టుకున్న గవర్నర్ తమిళిసై Tamilisai Soundararajan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11279649-576-11279649-1617551506398.jpg)
గవర్నర్ తమిళి సై సౌందరరాజన్
కొండ చిలువను పట్టుకున్న ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అర్బన్ ఫారెస్ట్ సందర్శించడం ఓ ప్రత్యేక అనుభూతిలా అనిపించిందని తెలిపారు. అధికారులు పర్యటకులను ఆకర్షించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్ల చెప్పారు.
ఇదీ చదవండి:మంత్రి ఈటలకు గవర్నర్ తమిళిసై ఫోన్