చిత్తూరు జిల్లా పిచ్చాటూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలు ప్రయాణిస్తున్న ఓ టెంపో వ్యాను బోల్తా పడి.. 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. తమిళనాడు రాష్ట్రం బుచ్చెరి, కాశిరెడ్డి పేట గ్రామానికి చెందిన 28 మంది కూలీలు పిచ్చాటూరుకు వరినాట్లు వేసేందుకు వ్యానులో వస్తుండగా ప్రమాదం జరిగింది.
టెంపో బోల్తా... 19 మందికి గాయాలు - పిచ్చాటూరులో వ్యాను బోల్తా న్యూస్
తమిళనాడు నుంచి పనుల కోసం.. ఆంధ్రప్రదేశ్‌కు కూలీలతో వస్తోన్న ఓ టెంపో వ్యాను చిత్తూరు జిల్లా పిచ్చాటూరు సమీపంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 19 మంది గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
![టెంపో బోల్తా... 19 మందికి గాయాలు tamilanadu-auto-accident-at-chittoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5369722-913-5369722-1576306690163.jpg)
టెంపో బోల్తా... 19 మందికి గాయాలు
పిచ్చాటూరు సమీపంలోని రోడ్డు పక్కన గోతిలో పడి ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాదంలో గాయపడిన కూలీలను... పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. కూలీల్లో తీవ్రంగా గాయపడిన పదిమందిని మెరుగైన చికిత్స కోసం తిరుపతితో సహా ఇతర ప్రాంతాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
టెంపో బోల్తా... 19 మందికి గాయాలు
- ఇదీ చూడండి: దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం- 43 మంది దుర్మరణం