తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతి కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం'

బీసీలకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలలో 25 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేస్తానని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. ఆచారిని ఓబీసీ సెంట్రల్ కమిటీ, బీసీ ఉద్యోగులు, న్యాయవాదులు ఘనంగా సన్మానించారు.

జాతీయ బీసీ కమిషన్​ సభ్యునిగా తల్లోజు ఆచారి

By

Published : Mar 26, 2019, 6:30 PM IST

జాతీయ బీసీ కమిషన్​ సభ్యునిగా తల్లోజు ఆచారి
బీసీల ఆరాధ్యదైవమైన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలను ప్రతి పబ్లిక్ , ప్రైవేట్ సెక్టార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి తెలిపారు. ఇటీవలజాతీయసభ్యునిగా నియామకమైన ఆయనను బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో ఓబీసీ సెంట్రల్ కమిటీ, బీసీ ఉద్యోగులు, న్యాయవాదులు ఘనంగా సన్మానించారు.

మహిళలకు ప్రాధాన్యం

అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొన్నారు. దిల్లీలో ఈనెల 27న కమిషన్ మొదటి సమావేశం జరుగనుందని... బీసీల సమస్యలు కమిషన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి:మే15 నుంచి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు!

ABOUT THE AUTHOR

...view details