తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమష్టి కృషితో బోనాలను ఘనంగా నిర్వహిద్దాం' - mahankali

ఈనెల 21,22 తేదీల్లో జరిగే ఉజ్జయిన మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

ఉజ్జయిన మహంకాళి బోనాల ఏర్పాట్లు

By

Published : Jun 20, 2019, 1:16 PM IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నది. పండుగ విశిష్టత తెలిసేలా ఉజ్జయిని మహంకాళి బోనాలను ఘనంగా జరిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బోనాల ఏర్పాట్లను మంత్రి తలసాని, జీహెచ్​ఎంసీ కమిషనర్ దానకిశోర్, టౌన్ ప్లానింగ్ శానిటేషన్ విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు.

ఉజ్జయిన మహంకాళి బోనాల ఏర్పాట్లు
మహంకాళి బోనాలకు లక్షల సంఖ్యలో జనం తరలి వస్తారు. వారికి అన్ని సౌకర్యాలు సమకూర్చాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సికింద్రాబాద్ పరిధిలో ఉన్న దేవాలయాలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ప్రత్యేక దారి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని మంత్రి తలసాని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details