హైదరాబాద్ మసాబ్ ట్యాంక్‌లోని మత్స్యశాఖ కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాలయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు.
తప్పుడు ఫిర్యాదులు చేస్తే చర్యలే: తలసాని - talasani srinivas yadav review on temple lands
దేవాలయ భూములు, ప్రైవేటు భవనాలపై తప్పుడు ఫిర్యాదులు చేస్తే తాడా చట్టం ద్వారా చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. హైదరాబాద్ మసాబ్ ట్యాంక్‌లోని మత్స్య శాఖ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

తప్పుడు ఫిర్యాదులు చేస్తే చర్యలే: తలసాని
గోషామహల్లో ఉన్న 50 దేవాలయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తామన్నారు. అందుకోసం ఓ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ దేవలయాల స్థితిగతులపై వివరాలను సేకరించి ప్రభుత్వానికి సమర్పిస్తుందని చెప్పారు. గోషామహల్లో కొందరు పనిగట్టుకుని భవనాలపై ఫిర్యాదులు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని చెప్పారు. అటువంటి వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: చర్ల ఎదురు కాల్పులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్