తెలంగాణ

telangana

ETV Bharat / state

గవర్నర్.. రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతీసేలా మాట్లాడారు: మంత్రి తలసాని - Governor Tamilisai Soundara Rajan latest news

Talasani Counter to Governor Tamilisai Comments: గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలకు మంత్రి తలసాని కౌంటర్ ఇచ్చారు. గణతంత్ర దినోత్సవంలో రాజకీయాలు మాట్లాడటం తగదని హితవు పలికారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా గవర్నర్ మాట్లాడారని విమర్శించారు.

Talasani Srinivas Yadav
Talasani Srinivas Yadav

By

Published : Jan 26, 2023, 2:10 PM IST

రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతీసేలా గవర్నర్ మాట్లాడారు: మంత్రి తలసాని

Talasani Counter to Governor Tamilisai Comments: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. గణతంత్ర దినోత్సవం రోజు రాజకీయాలు మాట్లాడడం తగదని విమర్శించారు. గవర్నర్ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతినేలా మాట్లాడారని ఆరోపించారు. తమిళిసై వైఖరిపై.. రాష్ట్రపతికి లేఖ రాస్తామని తెలిపారు. గవర్నర్ విషయంలో కల్పించుకోవాలి రాష్ట్రపతిని కోరతామని చెప్పారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సరైంది కాదని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజును.. రాజకీయాలకు ఉపయోగించడం తగదని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆక్షేపించారు.

అంతకు ముందు వసంత పంచమి సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. 108 కిలోల కుంకుమ, పసుపును అమ్మవారికి సమర్పించారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.. వసంత పంచమి పురస్కరించుకొని ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి.. ఉదయం నుంచి భక్తులు రాకతో కిటకిటలాడుతోంది.

అభివృద్ధి చూడలేకే ​అనవసరపు విమర్శలు: తెలంగాణలోని వ్యవసాయ క్షేత్రాలు, నూతన భవనాలను విమర్శించడం బాధ్యతల్లో ఉన్నవారికి గౌరవం కాదని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. పలు అంశాల్లో.. తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంతో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోందని వివరించారు. కళ్లుండి చూడలేని వారు.. చెవులుండి వినలేని వారే అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతల్లో ఉన్న కొంత మంది అభివృద్ధిని చూడకపోవడం విచారకరమని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అసలేం జరిగిదంటే: రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకల సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ కేసీఆర్‌ ప్రభుత్వ తీరుపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొత్త భవనాలు నిర్మించడమే అభివృద్ధి కాదని తెలిపారు. తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని పేర్కొన్నారు. తాను కొంత మందికి నచ్చకపోయినా.. తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని వివరించారు. రోజుకు 22 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడించారు.

"గణతంత్ర దినోత్సవంలో రాజకీయాలు మాట్లాడటం తగదు. రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతీసేలా గవర్నర్ మాట్లాడారు. గవర్నర్ వైఖరిపై రాష్ట్రపతికి లేఖ రాస్తాం.గవర్నర్ విషయంలో రాష్ట్రపతి కల్పించుకోవాలి." - తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి

ఇవీ చదవండి:కొందరికి ఫార్మ్‌హౌస్‌లు కాదు.. అందరికి ఫార్మ్‌లు కావాలి: గవర్నర్‌

అభివృద్ధి చూడలేకే ​అనవసరపు విమర్శలు : గుత్తా సుఖేందర్ రెడ్డి

అట్టహాసంగా గణతంత్ర వేడుకలు.. జెండా ఎగురవేసిన ముర్ము.. హాజరైన ఈజిప్ట్ అధ్యక్షుడు, ప్రధాని మోదీ

ABOUT THE AUTHOR

...view details