తెలంగాణ

telangana

ETV Bharat / state

CINE WORKERS: మధ్యాహ్నం ఇరువర్గాలు భేటీ కావాలి: తలసాని - హైదరాబాద్ తాజా వార్తలు

CINE WORKERS: సినీ నిర్మాతల మండలి, కార్మిక నాయకులు పంతాలు, పట్టింపులకు పోకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు నిర్మాతల మండలి, ఫిలిం ఫెడరేషన్‌ నాయకులు వేర్వేరుగా ఆయనను కలిశారు. సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి మంత్రి వారికి సూచించారు.

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

By

Published : Jun 23, 2022, 12:22 PM IST

CINE WORKERS: వేతనాల పెంచాలంటూ సినీ కార్మికులు చేస్తున్న నిరసన కొనసాగుతోంది. రెండోరోజు కూడా వారు షూటింగ్‌లకు దూరంగా ఉన్నారు. దీంతో 25కు పైగా సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. మరోవైపు సినీకార్మికులు షూటింగ్‌లకు హాజరైతేనే వేతనాల పెంపుపై చర్చిస్తామని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ చెబుతోంది. 15 రోజుల పాటు పాత పద్ధతిలోనే కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఫిల్మ్‌ ఛాంబర్‌ నిర్మాతలకు సూచించింది. ఈ నేపథ్యంలో పంచాయితీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వద్దకు చేరింది.

పంతాలు, పట్టింపులు వద్దని ఇరు పక్షాలకి చెప్పానని మంత్రి తలసాని తెలియచేశారు. రెండు వైపులా సమస్యలు ఉన్నాయన్నారు. కరోనా పరిస్థితులతో కార్మికుల వేతనాలు పెరగలేదని చెప్పారు. మధ్యాహ్నం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించామని తెలిపారు. షూటింగ్‌లపై రెండు పక్షాలు రెండు రకాలుగా మాట్లాడుతున్నాయని పేర్కొన్నారు. రెండు వర్గాలకు న్యాయం జరిగేలా కూర్చొని మాట్లాడుకోవాలని మంత్రి తలసాని వారికి సూచించారు.

తమ మాటకి కట్టుబడి ఉన్నామని.. షూటింగ్‌లు ప్రారంభమైతేనే వేతనాలపై చర్చిస్తామని నిర్మాత సి.కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఈరోజు కూడా షూటింగ్‌లు జరగడం లేదని.. నిర్మాతలంతా ఎవరితో పనిచేయించుకోవాలో వారితో చేయించుకుంటామని వ్యాఖ్యానించారు. అవసరమైతే నిరవధికంగా షూటింగ్‌లు ఆపడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.

ఇదీ చదవండి:సినీ కార్మికుల నిరసన.. షూటింగ్​లు బంద్​.. కారణం ఇదే!

'మహా' సంక్షోభం.. శిందేకు పెరుగుతున్న బలం.. అసోంలోనే మకాం!

ABOUT THE AUTHOR

...view details