తెలంగాణ

telangana

ETV Bharat / state

Talasani Srinivas Yadav Latest Comments : 'ప్రజలు కాంగ్రెస్​ను నమ్మే పరిస్థితులు లేవు' - Talasani Latest Comments on Congrss Party

Talasani Srinivas Yadav Latest Comments on Congress : హైదరాబాద్​లోని గోశామహల్​లో బీసీ కులవృత్తిదారులకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ పార్టీపై పలు విమర్శలు చేశారు. ఓట్లను పెంచుకోవాలనే లక్ష్యంతో హామీలను ఇస్తుందని ఆరోపించారు.

Talasani Srinivas Yadav Latest Comments
Talasani Inagurate BC Corporation Development Works

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2023, 7:31 PM IST

Talasani Srinivas Yadav Latest Comments on Congress Declaration : రంగారెడ్డి జిల్లాలో చేవెళ్లలో కాంగ్రెస్​ పార్టీ నిర్వహించిన ప్రజా గర్జన సభలో 12 అంశాలతో విడుదల చేసిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​పై బీఆర్ఎస్​ నాయకుల విమర్శలు వర్షం కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani) ఆ అంశంపై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ చేసే హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివని.. మంత్రి తెలిపారు. గోశామహల్​లో బీసీ కులవృత్తిదారులకు ఆర్థిక సాయంపంపిణీతో పాటు.. పలు అభివృద్ధి పనులను.. స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్లతో కలిసి మంత్రి తలసాని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఓట్లను దండుకొనే లక్ష్యంతో అవగాహన లేకుండా హామీలు ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేసి చూపెట్టాలని.. అలాగే 50 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్​ను ప్రజలు నమ్మే పరిస్థితులు లేవన్నారు.

"కాంగ్రెస్​ పార్టీని రాష్ట్రంలో ఎవ్వరు నమ్మేవారు లేరు. ఎందుకంటే కొత్త పార్టీ అంటే వారు మనుగడకి హామీలు నెరవేరుస్తుందని ప్రజలు నమ్ముతారు. కాంగ్రెస్​ 50 సంవత్సరాల చరిత్ర అందరికీ తెలుసు. కాంగ్రెస్​ రైతాంగానికి రైతు బంధు, రైతుబీమా ఇవ్వలేదు. కరెంట్​, నీళ్లు సరిగ్గా అందించ లేదు. ఏదో ఎన్నికల్లో గెలవాలనే.. డిక్లరేషన్​లు ప్రకటిస్తోంది. ప్రజల కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్​ కాదు."-తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి

Comments on Congress SC, ST Declaration: ఆగస్ట్​ 26న కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలంగాణలోని ఆయా పార్టీల నాయకుల సమక్షంలో 12 అంశాలతో కూడిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​ను ప్రకటించారు. దీనిపై బీఆర్​ఎస్​ నాయకులు స్పందించి.. పలు ఆరోపణలు చేశారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదకన కాంగ్రెస్​ది డిక్షరేషన్(Congress Declaration)​ సభ కాదు.. అధికారం రాదనే ఫ్రస్ట్రేషన్​ సభని ట్వీట్​ చేశారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు హస్తం పార్టీవన్ని ఉత్తితి డిక్లరేషన్​గా అభివర్ణించారు. కాంగ్రెస్​ నాయకులకి తెలంగాణను అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తదితర మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయంలో ఘాటుగా స్పందించారు. తరువాత రోజు నుంచి బీఆర్​ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.

Mallikarjuna Kharge Release 12 Points SC And ST Declaration : చేవెళ్ల సభలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​.. విడుదల చేసిన ఖర్గే

ABOUT THE AUTHOR

...view details