తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం - SRINIVAS YADABV

నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్​లో నిర్వహించబోయే రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం

By

Published : Jun 1, 2019, 5:20 PM IST

ఐదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్​లో రేపు జరగబోయే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ వేడుకలకు సంబంధించి గత 5 రోజులుగా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారని తెలిపారు. 70 సంవత్సరాల్లో జరగని రాష్ట్ర అభివృద్ధి తెరాసతోనే సాధ్యమైందని చెప్పారు. పబ్లిక్ గార్డెన్స్​లో నిర్వహించబోయే రాష్ట్ర అవతరణ వేడుకలకు భద్రత కట్టుదిట్టం చేసామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆంక్షలు విధించామని స్పష్టం చేశారు.

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details