talasani srinivas yadav : క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేపు విందు ఇవ్వనున్నట్లు... రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్తో కలిసి పరిశీలించారు. ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వమే నిర్వహిస్తోందని మంత్రి వెల్లడించారు. తెలంగాణవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, గ్రామాల్లోనూ పండుగ కానుకల పంపిణీ జరుగుతోందని చెప్పారు.
talasani srinivas yadav : రేపే క్రైస్తవ సోదరులకు విందు.. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి - తెలంగాణ వార్తలు
talasani srinivas yadav :ప్రభుత్వం తరఫున క్రైస్తవ సోదరులకు ఇచ్చే విందు ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఈ విందును ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్... క్రైస్తవ సోదరులతో కలిసి రేపు భోజనం చేస్తారని చెప్పారు.
మంగళవారం సాయంత్రం జరగనున్న ఈ విందు కోసం... క్రైస్తవ మత పెద్దలకు ఇప్పటికే ఆహ్వానం అందించామని మంత్రి పేర్కొన్నారు. క్రైస్తవ పెద్దలతో కలిసి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విందు చేస్తారని... మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని చర్చిలకు ఇప్పటికే ఆహ్వానాలు పంపించామన్నారు. ఆ ఏసుక్రీస్తు దయతో కరోనా, ఒమిక్రాన్ పోవాలని కోరుకుంటున్నట్లు మంత్రి అన్నారు. క్రైస్తవ భవన్, శ్మశాన వాటికను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ఎమ్మెల్యే దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ ఎమ్ఎస్ ప్రభాకర్, రాజేశ్వరరావు, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Ministers Protest over paddy procurement : మోతెత్తిన చావుడప్పు.. కేంద్రం తీరుపై భగ్గుమన్న మంత్రులు