తెలంగాణ

telangana

ETV Bharat / state

నాడు మోండా మార్కెట్​ ప్రత్యర్థులు - నేడు బీఆర్ఎస్​లో​ వీరులు - talasani srinivas political story

Talasani Srinivas And Padma Rao Goud Political Journey : బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఉప సభాపతి పద్మారావుగౌడ్‌ రాజకీయ ప్రస్థానం చాలా ఆసక్తికరమైంది. ఇద్దరు నేతలు మోండా మార్కెట్‌ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి కార్పొరేటర్‌, ఎమ్మెల్యే, మంత్రి పదవులను అధిరోహించారు. మొదటిసారి ప్రత్యర్థులుగా తలపడిన ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కీలక పదవులు నిర్వహిస్తున్నారు.

Telangana Assembly Election 2023
Talasani Srinivas And Padmarao Goud Political Journy

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2023, 3:00 PM IST

Talasani Srinivas And Padmarao Goud Political Journy: తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఉప సభాపతి పద్మారావుగౌడ్‌ రాజకీయ ప్రస్థానం చాలా ఆసక్తికరమైంది. చిన్నతనంలోనే రాజకీయాల్లోకి ప్రవేశించి జనాకర్షక నేతలుగా ఎదిగారు. మోండా మార్కెట్‌ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి కార్పొరేటర్‌, ఎమ్మెల్యే, మంత్రి పదవులను అధిరోహించారు. మొదటిసారే ప్రత్యర్థులుగా తలపడిన ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కీలక పదవులు నిర్వర్తిస్తున్నారు.

హైదరాబాద్ రాజకీయ నాయకుల్లో ప్రముఖుడు. బీసీ యాదవ సామజిక వర్గానికి చెందిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఈయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు కేసీఆర్ కేబినేట్‌లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా పని చేస్తోన్న ఈ బీసీ నేత..2004 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి టి. పద్మారావు గౌడ్ చేతిలో ఓడిపోయారు.

పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలతో గులాబీ నేతల ఓట్ల వేట - మరోమారు అవకాశమిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామంటూ 'మాట'

అక్టోబరు 6, 1965న జన్మించిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నతనంలోనే రాజకీయాల్లోకి దిగారు. మొదటిసారి 1986లో పద్మారావుకు పోటీగా మోండా మార్కెట్‌ కార్పొరేటర్‌గా జనతాదళ్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. కార్పొరేటర్‌గా ఓడిపోయిన తలసాని.. తరువాత కాలంలో చంద్రబాబును సంప్రదించి టీడీపీలో చేరారు. 1994లో సికింద్రాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకిదిగి కాంగ్రెస్‌ అభ్యర్థి రవీంద్రనాథ్‌పై గెలుపొందారు. 1999 ఎన్నికల్లోనూ సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో.. అప్పటి సీఎం చంద్రబాబు ఆయనను మంత్రిగా తీసుకున్నారు.

గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం - ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థుల ఓట్ల వేట

Telangana Assembly Election 2023: బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న ఉపసభాపతి పద్మారావుగౌడ్‌ ఏప్రిల్‌ 7, 1954న జన్మించారు. 1973లో యువజన కాంగ్రెస్‌లో చేరి.. 1977 నుంచి జంట నగరాల్లో క్రియాశీలంగా పనిచేశారు. 1986లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మోండా మార్కెట్‌ డివిజన్‌ కార్పొరేటర్‌గా తొలిసారి బరిలో నిలిచి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌పై విజయం సాధించారు. 1991 వరకు కార్పొరేటర్‌గా పనిచేసిన పద్మారావుగౌడ్‌ 2001లో బీఆర్ఎస్ (టీఆర్ఎస్)లో చేరారు. పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడిగా పనిచేస్తూ 2002లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.

మొదటిసారి 1986లో కార్పొరేటర్‌ పదవికి పోటీపడిన వీరిద్దరు.. తిరిగి 2004లో ఎమ్మెల్యే స్థానానికి పోటీపడ్డారు. పద్మారావుగౌడ్‌ గెలవగా, తలసాని ఓడారు. నాలుగేళ్ల తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా అప్పటి బీఆర్ఎస్(టీఆర్ఎస్) ఎమ్మెల్యేలంతా 2008లో రాజీనామా చేయగా సికింద్రాబాద్‌ ఉపఎన్నిక జరిగింది. తలసాని పద్మారావుపై ఎక్కువ మెజార్టీతో గెలిచారు.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో (బీఆర్ఎస్) టీఆర్ఎస్ నుంచి పద్మారావుగౌడ్‌ సనత్‌నగర్‌ నియోజకవర్గంలో పోటీచేసి.. కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అదే ఎన్నికలో సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీ చేసిన తలసాని కాంగ్రెస్‌ అభ్యర్థి జయసుధ చేతిలో ఓడిపోయారు. తెలంగాణ ఏర్పాడ్డాక 2014 ఎన్నికల్లో వీరి నియోజకవర్గాలు మారాయి.

తలసాని టీడీపీ నుంచి సనత్‌నగర్‌ ఎమ్మెల్యేగా, పద్మారావుగౌడ్‌ (బీఆర్ఎస్) టీఆర్ఎస్ నుంచి సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పద్మారావుగౌడ్‌ ఎక్సైజ్‌ శాఖ, క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ఎన్నికల్లో గెలిచి ఉపసభాపతి అయ్యారు. సనత్‌నగర్‌ ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని (బీఆర్ఎస్) టీఆర్ఎస్​లో చేరి మంత్రి అయ్యారు. 2018లో మరోసారి గెలిచి మంత్రివర్గంలో కొనసాగుతున్నారు.

రాష్ట్రంలో రసవత్తరంగా సాగుతోన్న ఎన్నికల ప్రచారాలు - రంగంలోకి దిగుతున్న స్టార్‌ క్యాంపెయినర్లు

నేడు తొర్రూరు, హాలియా, ఇబ్రహీంపట్నంలో కేసీఆర్​ సభలు

ABOUT THE AUTHOR

...view details