విజయ డైరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకెళ్లాలని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. విజయ ఉత్పత్తులకు మంచి ప్రజాధరణ ఉందని మంత్రి పేర్కొన్నారు. సచివాలయంలో విజయ డైరీ ఉత్పత్తుల విక్రయానికి వినియోగించనున్న ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆయన పరిశీలించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 200 ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేసి విజయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లడం జరుగుతుందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థకశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విజయడైరీ ఎండీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
డైరీ ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక ఎలక్ట్రిక్ వాహనం - డైరీ ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక ఎలక్ట్రిక్ వాహనం
విజయ డైరీ ఉత్పత్తులకు మంచి ప్రజాధరణ ఉందని, ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకెళ్లాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. డైరీ ఉత్పత్తుల విక్రయానికి వినియోగించనున్న ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆయన పరిశీలించారు.
డైరీ ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక ఎలక్ట్రిక్ వాహనం