తెలంగాణ

telangana

ETV Bharat / state

'తలసాని సాయికిరణ్​కు సినీ పరిశ్రమ మద్దతు' - hyderabad

సికింద్రాబాద్​ లోక్​సభ తెరాస అభ్యర్థి తలసాని సాయికిరణ్​​కు తెలుగు సినీ పరిశ్రమ మద్దతు ప్రకటించింది. హైదరాబాద్​లోని ఓ హోటల్​లో సినీ పెద్దలతో మీట్​ అండ్​ గ్రీట్​ కార్యక్రమాన్ని నిర్వహించారు.

'తలసాని సాయికిరణ్​ ​కు సినీ పరిశ్రమ మద్దతు'

By

Published : Apr 4, 2019, 6:15 AM IST

Updated : Apr 4, 2019, 11:46 AM IST

'తలసాని సాయికిరణ్​ ​కు సినీ పరిశ్రమ మద్దతు'
లోక్​సభ ఎన్నికల్లో తెరాస సికింద్రాబాద్​ అభ్యర్థి తలసాని సాయికిరణ్​కు సినీ పరిశ్రమ మద్దతు ప్రకటించింది. హైదరాబాద్​లోని ఓ హోటల్​లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ప్రముఖ సినీ నిర్మాత దిల్​ రాజు, సుధాకర్​ రెడ్డి, కేఎస్​ రామారావు, సి.కల్యాణ్​, ఏషియన్​ సినిమాస్​ సునీల్​ హాజరయ్యారు. 11న జరిగే ఎన్నికల్లో సాయికిరణ్​ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. 16 సీట్లు సాధించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలో తలసాని కుమారుడు ఒకరిగా ఉండటం అభినందనీయమన్నారు దిల్​ రాజు.

32 ఏళ్ల వయసులో తనను పార్లమెంట్​కు పంపిస్తే జంట నగరాలను ప్రపంచ స్థాయి నగరాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని సాయికిరణ్​ తెలిపారు.

Last Updated : Apr 4, 2019, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details