ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు నిర్మాణాత్మక పద్ధతిలో ప్రచారం నిర్వహించాలని తెరాస యువజన విభాగం నాయకుడు తలసాని సాయి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ముషీరాబాద్‌లోని కషిస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు భారీ మెజారిటీ ఖాయం'
రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెరాస యువజన విభాగం నాయకుడు తలసాని సాయి పేర్కొన్నారు. డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ముషీరాబాద్‌లోని కషిన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన తలసాని సాయి
పార్టీ శ్రేణులు నియోజక వర్గంలోని ప్రతీ పట్టభద్రుడి ఇంటికి వెళ్లి ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని సాయి కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వారికి వివరించాలని సూచించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకలా ఉండేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు.
ఇదీ చూడండి: దుబ్బాక తెరాస అభ్యర్థిని ఖరారు చేసిన సీఎం కేసీఆర్