తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ, కార్పొరేట్​ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలి: సాయి కిరణ్​ యాదవ్​ - తలసాని సాయి కిరణ్​ యాదవ్​ తాజా వార్తలు హైదరాబాద్​

వచ్చే ఎమ్మెల్సీ, కార్పొరేట్​ ఎన్నికల్లో తెరాసను గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తలసాని సాయి కిరణ్ యాదవ్ కోరారు. ప్రధానమంత్రి దేశ సరిహద్దుల్లో ఉండి పోరాటం చేయరని.. దేశ రక్షణ కోసం ఆర్మీ అధికారులున్నారని పేర్కొన్నారు. ఆర్మీకి, రాజకీయాలకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ, కార్పొరేట్​ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలి: సాయి కిరణ్​ యాదవ్​
ఎమ్మెల్సీ, కార్పొరేట్​ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలి: సాయి కిరణ్​ యాదవ్​

By

Published : Oct 2, 2020, 10:54 PM IST

వచ్చే ఎమ్మెల్సీ, కార్పొరేట్​ ఎన్నికల్లో తెరాసను గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఎమ్మెల్సీ గ్యాడ్యుయేట్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ కోరారు. శుక్రవారం హైదరాబాద్​ అడ్డగుట్ట తెరాస పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బస్తీ కమిటీ ఇంఛార్జీలు, పట్టభద్రులైన యువకులతో ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రధానమంత్రి దేశ సరిహద్దుల్లో ఉండి పోరాటం చేయరని.. దేశ రక్షణ కోసం ఆర్మీ అధికారులున్నారని తలసాని సాయికిరణ్​ పేర్కొన్నారు. ఆర్మీకి, రాజకీయాలకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. భారత దేశంలో దేశభక్తి లేనోడు ఎవరైనా ఉన్నారా అంటూ ఘాటు విమర్శలు చేశారు. ముందుగా కార్పొరేట్ ఎన్నికలు వస్తున్నాయని గులాబీ పార్టీని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీలో కూడా తెరాస అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:బంగారు భవిష్యత్​కు యువతే నాంది: తలసాని సాయికిరణ్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details