తెలంగాణ

telangana

ETV Bharat / state

పీవీ ఘాట్​ వద్ద నరసింహారావు చిత్రపటానికి తలసాని నివాళులు - పీవీ నరసింహారావు 15వ వర్ధంతి

పీవీ నరసింహారావు 15వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీవీ ఘాట్ వద్ద ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

talasani
పీవీ ఘాట్​ వద్ద నరసింహారావు చిత్రపటానికి మంత్రి తలసాని నివాళులు

By

Published : Dec 23, 2019, 12:14 PM IST

దేశ మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు 15వ వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద ఆయన చిత్రపటానికి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం పీవీ నరసింహారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండరను మంత్రి ఆవిష్కరించారు. నరసింహారావు అనేక సంస్కరణలకు ఆద్యుడని, భవిష్యత్తుకు పునాదులు వేసిన నాయకుడని కొనియాడారు. భారత ఆర్థిక రంగాన్ని పటిష్ట పరిచిన నేత పీవీ నరసింహారావు అని తలసాని ప్రశంసించారు.

పీవీ ఘాట్​ వద్ద నరసింహారావు చిత్రపటానికి మంత్రి తలసాని నివాళులు

ఇవీ చూడండి: 'దిశ' నిందితుల మృతదేహాలకు కొనసాగుతున్న రీపోస్టుమార్టం

ABOUT THE AUTHOR

...view details