తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థిని అభినందించిన తలసాని కిరణ్​ - telangana news today

సికింద్రాబాద్​కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి రహీనా తారానంను తెరాస పార్టీ ఇంఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ అభినందించారు. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ప్రథమ స్థానం సాధించినందుకు ఆమెను ప్రశంసించారు.

Talasani Kiran congratulating the student
విద్యార్థిని అభినందించిన తలసాని కిరణ్​

By

Published : Mar 19, 2021, 9:13 PM IST

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ తెరాస పార్టీ ఇంఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ పేర్కొన్నారు. సికింద్రాబాద్​కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి రహీనా తారానంను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా.. తన ప్రతిభతో హైదరాబాద్ నగరానికే కాకుండా రాష్ట్రానికి గుర్తింపు వచ్చిందని ఆయన ప్రశంసించారు.

ఈ నెల 13 నుంచి 19 వరకు మేడ్చల్ జిల్లా సైనిక్​పురిలో ఆల్ ​ఇండియా టెన్నిస్ అకాడమీ (ఏఐటీఏ) ఆధ్వర్యంలో అండర్-18 జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలు జరగనున్నాయి. వచ్చే నెలలో గుజరాత్​లోని అహ్మదాబాద్, తమిళనాడు రాష్ట్రంలోని మధుర, ఆంద్రప్రదేశ్​లోని విశాఖపట్నంలలో నిర్వహించే అంతర్జాతీయ పోటీలకు హాజరయ్యేందుకు సహకరించాలని రహీనా సాయికిరణ్​ను కోరింది. అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తానని సాయి కిరణ్​ హామీ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా అగ్రస్థానంలో నిలవాలని, రాష్ట్రానికి తగిన గుర్తింపు తీసుకురావాలని ఆయన ఆకాక్షించారు.

ఇదీ చూడండి:75 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details