హైదరాబాద్ రాంగోపాల్ పేట్ డివిజన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. రూ.39 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని.. నాలా పూడిక తీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దేశంలోనే అత్యంత నివాసయోగమైన నగరాల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ అని వెల్లడించారు. ప్రపంచ నగరంగా రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక కార్పొరేటర్ అతెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
దేశంలోనే నం 1 నగరం హైదరాబాద్ : మంత్రి తలసాని - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలో రూ.39 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ అతెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారు.
దేశంలోనే నెం1 నగరం 'హైదరాబాద్': మంత్రి తలసాని