విదేశీ జంతువులు, పక్షులు పెంచుకుంటున్న ప్రతి ఒక్కరు అటవీశాఖ అనుమతి తీసుకోవాల్సిందేనని పీసీసీఎఫ్ ఆర్.శోభ తెలిపారు. డిసెంబర్ రెండో తేదీలోగా ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వెల్లడించారు. విదేశీ జంతువులను, పక్షులను దిగుమతి చేసుకోవటం, పెంచటం, క్రయవిక్రయాలు పెరగడం వల్ల కేంద్ర పర్యావరణశాఖ ఈ నిర్ణయం తీసుకుందని ఆమె అన్నారు.
'విదేశీ పెంపుడు జంతువులకు అనుమతులు తప్పనిసరి' - అటవీశాఖ అనుమతులు
విదేశీ జంతువులు, పక్షులను పెంచుకునే వారు తప్పనిసరిగా అటవీశాఖ అనుమతి తీసుకుకోవాలని పీసీసీఎఫ్ ఆర్.శోభ వెల్లడించారు. దీనికి సంబంధించి కేంద్ర పర్యావరణశాఖ ఇప్పటికే నిబంధనలు విడుదల చేసిందని ఆమె తెలిపారు. డిసెంబర్ రెండో తేదీలోగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు.

'విదేశీ పెంపుడు జంతువులకు అనుమతులు తప్పనిసరి'
గడువులోగా నమోదు చేసుకున్న వారికి డిసెంబర్ 15 లోగా అనుమతి పత్రాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు సమయంలో ఎలాంటి పత్రాలు అవసరం లేదని, అనుమతి పొందాక వివరాలు మాత్రమే సమర్పించాలన్నారు. రాష్ట్ర పరిధిలోని విదేశీ పెంపుడు జంతువులు కలిగి ఉన్న వ్యక్తులు, సంస్థలు, రిసార్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శోభ వెల్లడించారు. అటవీశాఖ వెబ్సైట్ http://forestsclearance.nic.in/registerationnew.aspx ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో సంచార కరోనా పరీక్షలు పెంచాలి: హైకోర్టు