ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మంత్రుల ఇళ్లు ముట్టడి కార్యక్రమాన్ని ఆర్టీసీ కార్మికులు నిర్వహించారు. ఇందులో భాగంగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను హైదరాబాద్ కంటోన్మెంట్ ఆర్టీసీ జేఏసీ నాయకులు వచ్చి కలిశారు.
గత 37 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు. ఆర్టీసీ కార్మికుల బాధలను అర్థం చేసుకుని వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం దిశగా కృషి చేయాలని తలసానికి విన్నవించుకున్నారు. తాను సీఎం దృష్టికి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించిన సమస్యను తీసుకెళ్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.