తెలంగాణ

telangana

ETV Bharat / state

హోటల్ పైనుంచి దూకి వెయిటర్ ఆత్మహత్య - Taj hotel waiter commits suicide

తాజ్​మహల్​ హోటల్ పై నుంచి దూకి వెయిటర్​ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నేపాల్ కి చెందినవాడిగా గుర్తించారు. ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు తెలిపారు.

హోటల్ పైనుంచి దూకి వెయిటర్ ఆత్మహత్య

By

Published : Jul 12, 2019, 6:05 PM IST

Updated : Jul 12, 2019, 7:02 PM IST

హైదరాబాద్ అబిడ్స్ లోని తాజ్ మహల్ హోటల్ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి మద్యం సేవించి తెల్లవారు జామున 2 గంటల సమయంలో హోటల్ రెండో అంతస్తు పై నుంచి దూకి చనిపోయాడు. మృతుడు నేపాల్ కి చెందిన మోతి(30)గా పోలీసులు తెలిపారు. మోతి నెల రోజుల క్రితం హోటల్లో వెయిటర్ గా విధుల్లో చేరాడు. ఆర్థిక, కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హోటల్ పైనుంచి దూకి వెయిటర్ ఆత్మహత్య
Last Updated : Jul 12, 2019, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details