తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.135 కోట్లతో టైహన్ టెస్ట్​ బెడ్​ నిర్మాణం

ఐఐటీ హైదరాబాద్‌లో టైహన్‌ టెస్ట్‌ బెడ్‌కు కేంద్రమంత్రి రమేష్ పోక్రియాల్​ శంకుస్థాపన చేశారు. రూ. 135 కోట్లతో టైహన్‌ టెస్ట్‌ బెడ్‌ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. వివిధ విభాగాలు సమష్టిగా పరిశోధనలు చేసి మంచి ఫలితాలు తీసుకురావాలన్నారు.

taihan-test-bed-construction-at-a-cost-of-rs-135-crore-concreted-by-central-minister-ramesh-pokhriyal
రూ.135 కోట్లతో టైహన్ టెస్ట్​ బెడ్​ నిర్మాణం

By

Published : Dec 29, 2020, 7:24 PM IST

ఐఐటీ హైదరాబాద్‌లో టైహన్‌ టెస్ట్‌ బెడ్‌కు... ఆన్‌లైన్‌ ద్వారా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోక్రియాల్‌ శంకుస్థాపన చేశారు. రూ.135 కోట్లతో నిర్మించనున్న టెస్ట్‌ బెడ్‌... రవాణా, ఆటోమొబైల్‌ రంగాలు ఎదుర్కొనే సవాళ్లకు పరిష్కారాలు చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఐటీ హైదరాబాద్‌లోని వివిధ విభాగాలు సమష్టిగా పరిశోధనలు చేసి మంచి ఫలితాలు తీసుకువస్తాయన్నారు. దేశం ఆత్మనిర్భర భారత్, స్కిల్​ ఇండియా వైపుగా అడుగులు వేస్తోందని పోక్రియల్​ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details