దుండగుడి చేతిలో సజీవదహనమైన అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. నాగోలు శ్మశానవాటికలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. గౌరవ సూచికంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. విజయారెడ్డి చితికి భర్త సుభాష్‌రెడ్డి నిప్పంటించారు. అంతకుముందు కొత్తపేటలోని విజయారెడ్డి నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది.
ముగిసిన తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు
నాగోలు శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి.
vijaya reddy
అంతిమయాత్రలో భారీగా రెవెన్యూ, ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పాటు సీపీ మహేశ్ భగవత్, తెజస అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొని ఆమెకు కడసారి వీడ్కోలు పలికారు. అంతిమయాత్ర పొడవునా రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇవీ చూడండి: అశ్రునయనాల మధ్య విజయారెడ్డి అంతిమయాత్ర
Last Updated : Nov 5, 2019, 5:01 PM IST